దుబాయ్‌ విమానం ఢీకొని 40 ఫ్లెమింగో పక్షుల మృతి

దుబాయ్‌ నుంచి వచ్చిన ఎమిరేట్స్‌ విమానం (ఈకే 508) ముంబయి ఎయిర్‌పోర్టులో కిందికి దిగుతున్న సమయంలో ఫ్లెమింగో పక్షుల గుంపును ఢీకొనడంతో దాదాపు 40 పక్షులు మృతిచెందాయి.

Published : 22 May 2024 04:12 IST

ముంబయి: దుబాయ్‌ నుంచి వచ్చిన ఎమిరేట్స్‌ విమానం (ఈకే 508) ముంబయి ఎయిర్‌పోర్టులో కిందికి దిగుతున్న సమయంలో ఫ్లెమింగో పక్షుల గుంపును ఢీకొనడంతో దాదాపు 40 పక్షులు మృతిచెందాయి. సోమవారం రాత్రి 9.00 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు మంగళవారం వెల్లడించారు. ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు. ఈ జాతి పక్షులు ఆ ప్రాంతంలో కనిపించడం అరుదన్నారు. తీవ్రంగా గాయపడి చుట్టుపక్కల ప్రాంతాల్లో చెల్లాచెదురుగా పడిపోయిన పక్షులను గుర్తించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ప్రమాదంపై దర్యాప్తు మొదలుపెట్టిన అధికారులు పక్షుల కళేబరాలను పోస్టుమార్టానికి తరలించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని పర్యావరణ కార్యకర్తలు కోరుతున్నారు. ప్రమాదంలో దుబాయ్‌ విమానం కూడా దెబ్బతిన్న కారణంగా ముంబయి నుంచి తిరుగు ప్రయాణాన్ని నిలిపివేసి, ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని