సంకట్‌ మోచన్‌ ఆలయాన్ని దర్శించుకున్న మోదీ, యోగి

ఎన్నికల ప్రచారంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి వారణాసిలోని సంకట్‌ మోచన్‌ హనుమాన్‌ ఆలయాన్ని దర్శించుకున్నారు.

Published : 22 May 2024 04:13 IST

వారణాసి: ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి వారణాసిలోని సంకట్‌ మోచన్‌ హనుమాన్‌ ఆలయాన్ని దర్శించుకున్నారు. కాశీతోపాటు దేశమంతటా ఉన్న తన కుంటుబసభ్యుల క్షేమం కోసం ప్రార్థించినట్లు మోదీ ‘ఎక్స్‌’ ద్వారా తెలిపారు. ప్రధానమంత్రి రాకతో ఆలయం ‘జై శ్రీరాం’ నినాదాలతో మార్మోగింది. భక్తులకు ముకుళిత హస్తాలతో మోదీ, యోగి అభివాదం చేశారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని