అధికరణం 370 రద్దును సమర్థించిన సుప్రీం తీర్పు సమీక్షకు నిరాకరణ

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగ అధికరణం 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడాన్ని సమర్థించిన గత ఏడాది డిసెంబరు 11 నాటి సుప్రీంకోర్టు తీర్పును సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి.

Updated : 22 May 2024 05:04 IST

పిటిషన్లను తోసిపుచ్చిన రాజ్యాంగ ధర్మాసనం

దిల్లీ: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగ అధికరణం 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడాన్ని సమర్థించిన గత ఏడాది డిసెంబరు 11 నాటి సుప్రీంకోర్టు తీర్పును సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి. సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం వీటిని పరిశీలించి విచారణ అర్హత లేదని తేల్చింది. పిటిషన్లను తోసిపుచ్చుతున్నట్లు పేర్కొంది. ఈ ధర్మాసనంలో జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ బి.ఆర్‌.గవాయి, జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్న(ప్రస్తుతం రిటైర్డ్‌) ఉన్నారు. మే 1నాటి ఈ ఉత్తర్వు ప్రతి తాజాగా అందుబాటులోకి వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని