నా కుటుంబాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారు

ఆప్‌ నేతలు తన వ్యక్తిగత వివరాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తున్నారని ఆప్‌ ఎంపీ స్వాతి మాలీవాల్‌ ఆరోపించారు. దీని వల్ల తన కుటుంబానికి ప్రమాదముందన్నారు. తనపై జరిగిన దాడి విషయంలో విచారణ జరుగుతున్న సమయంలో ఆప్‌ నేతలు తన వ్యక్తిగత వివరాలైన వాహన నంబర్లు మొదలైన వాటిని లీక్‌ చేయడాన్ని ప్రశ్నించారు.

Updated : 22 May 2024 05:00 IST

ఆప్‌ నేతలపై స్వాతి మాలీవాల్‌ విమర్శ

దిల్లీ: ఆప్‌ నేతలు తన వ్యక్తిగత వివరాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తున్నారని ఆప్‌ ఎంపీ స్వాతి మాలీవాల్‌ ఆరోపించారు. దీని వల్ల తన కుటుంబానికి ప్రమాదముందన్నారు. తనపై జరిగిన దాడి విషయంలో విచారణ జరుగుతున్న సమయంలో ఆప్‌ నేతలు తన వ్యక్తిగత వివరాలైన వాహన నంబర్లు మొదలైన వాటిని లీక్‌ చేయడాన్ని ప్రశ్నించారు. ఎక్స్‌ వేదికగా ఆమె మాట్లాడుతూ ‘‘నేను అవినీతికి పాల్పడినందుకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని దిల్లీ మంత్రులు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. భాజపా సూచనల మేరకే చేశానని వదంతులు సృష్టిస్తున్నారు. 2016లో నా మీద నమోదైన కేసుకు వ్యతిరేకంగా న్యాయబద్ధంగా పోరాటం చేశాను. కోర్టు అది తప్పుడు కేసని కొట్టేసింది. ఆ సమయంలో ఆప్‌ నేతలు నన్ను మహిళా సింగం అని పొగిడారు. వారికి నేనిప్పుడు భాజపా ఏజెంట్‌గా కనిపిస్తున్నానా?’’ అని మాలీవాల్‌ ఆప్‌ వర్గాలను నిలదీశారు. దిల్లీ మంత్రులు అధికార మత్తులో ఉన్నారని, నిజం ఎప్పటికైనా బయటపడుతుందన్నారు. వారు చెప్పే ప్రతి అబద్ధాన్ని కోర్టుకు లాగుతానని హెచ్చరించారు. నిజం మాట్లాడినందుకు పార్టీ మొత్తం తనను వేధిస్తోందన్నారు. పార్టీలోని ప్రతి ఒక్కరినీ పిలిచి తన వ్యక్తిగత వీడియోలు ఉంటే పంపమని కోరుతూ వాటిని లీక్‌ చేస్తున్నారని ఆరోపించారు.

బిభవ్‌ను ముంబయికి తీసుకెళ్లిన పోలీసులు

ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్‌పై దాడి కేసులో అరెస్ట్‌ అయిన కేజ్రీవాల్‌ వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌ కుమార్‌ను దిల్లీ పోలీసులు ముంబయి తీసుకెళ్లారు. ఇందుకు ఫార్మాట్‌ అయిన ఆయన ఐఫోన్‌ నుంచి డేటాను తిరిగి పొందేందుకు ఆయన్ను ముంబయి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని వివరించి దిల్లీలోని తీస్‌ హజారీ కోర్టు నుంచి అనుమతి తీసుకున్నారు. సాక్ష్యాలను బిభవ్‌ ధ్వంసం చేశారని స్వాతి మాలీవాల్‌ ఆరోపించిన వేళ, అది నిజమో కాదో తేల్చుకునేందుకు పోలీసులు ఈ చర్య చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని