మైక్రోసాఫ్ట్‌ ఏఐ ల్యాప్‌టాప్‌లు

సరికొత్త సర్ఫేస్‌ ప్రో, సర్పేస్‌ ల్యాప్‌టాప్‌ల పరిచయంతో మైక్రోసాఫ్ట్‌ సంస్థ పీసీ రంగంలో నవశకానికి నాంది పలికింది. కోపైలట్‌+, ఏఐతో అనుసంధానమైన తొలి పరికరాలు  ఇవే. క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ ఎక్స్‌ శ్రేణి ప్రాసెసర్లతో కూడిన వీటిపై నేరుగా కృత్రిమ మేధ పరిజ్ఞానాన్ని వాడుకోవచ్చు.

Published : 22 May 2024 04:19 IST

సరికొత్త సర్ఫేస్‌ ప్రో, సర్పేస్‌ ల్యాప్‌టాప్‌ల పరిచయంతో మైక్రోసాఫ్ట్‌ సంస్థ పీసీ రంగంలో నవశకానికి నాంది పలికింది. కోపైలట్‌+, ఏఐతో అనుసంధానమైన తొలి పరికరాలు  ఇవే. క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ ఎక్స్‌ శ్రేణి ప్రాసెసర్లతో కూడిన వీటిపై నేరుగా కృత్రిమ మేధ పరిజ్ఞానాన్ని వాడుకోవచ్చు. ఇందుకోసం ప్రత్యేకమైన న్యూరల్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ (ఎన్‌పీయూ) ఏర్పాటు చేశారు. ఇది ఒక సెకనుకు 40 ట్రిలియన్ల ఆపరేషన్స్‌ (టాప్స్‌) చేయగలదు. రోజంతా వాడుకునే సామర్థ్యం గల బ్యాటరీ వీటి సొంతం. ఇతర పీసీలతో చేయలేని ఎన్నో పనులు వీటి మీద చేసుకోవచ్చు. రీకాల్‌ టూల్‌ సాయంతో ఇంతకు ముందు పీసీలో చూసిన వాటిని తేలికగా గుర్తించొచ్చు, గుర్తుపెట్టుకోవచ్చు. క్రియేటర్‌ టూల్‌ ద్వారా నేరుగా పరికరంలోనే ఏఐ ఇమేజెస్‌ను సృష్టించుకోవచ్చు, మెరుగు  దిద్దుకోవచ్చు. లైవ్‌ క్యాప్షన్స్‌ ఫీచర్‌తోనైతే   భాషా అడ్డంకులు పూర్తిగా తొలగినట్టే అనుకోవచ్చు. ఎందుకంటే ఇది 40కిపైగా భాషల   మాటలను ఇంగ్లిష్‌లోకి అనువదిస్తుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు