మద్రాస్‌ ఐఐటీలో ఇళయరాజా సంగీత పరిశోధన కేంద్రం

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా పేరిట ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీ మద్రాస్‌ (ఐఐటీఎం)లో మాస్ట్రో ఇళయరాజా సెంటర్‌ ఫర్‌ మ్యూజిక్‌ లెర్నింగ్, రీసెర్చ్‌ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. త్రిపుర గవర్నర్‌ ఎన్‌.ఇంద్రసేనారెడ్డి, ఇళయరాజా సోమవారం ఈ కేంద్రానికి శంకుస్థాపన చేశారు.

Published : 22 May 2024 04:22 IST

కార్యక్రమంలో పాల్గొన్న త్రిపుర గవర్నర్‌ ఇంద్రసేనారెడ్డి, ఇళయరాజా, వి.కామకోటి

చెన్నై (వడపళని), న్యూస్‌టుడే: ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా పేరిట ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీ మద్రాస్‌ (ఐఐటీఎం)లో మాస్ట్రో ఇళయరాజా సెంటర్‌ ఫర్‌ మ్యూజిక్‌ లెర్నింగ్, రీసెర్చ్‌ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. త్రిపుర గవర్నర్‌ ఎన్‌.ఇంద్రసేనారెడ్డి, ఇళయరాజా సోమవారం ఈ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఐఐటీఎం డైరెక్టర్, ఆచార్యులు వి.కామకోటి మాట్లాడుతూ సంగీతం గురించి తెలుసుకోవడానికి లోతుగా పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆధునిక సాంకేతిక యుగంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కూడా తోడైందని, తద్వారా ఎక్కువ పరిశోధనలు చేయగలిగే వీలుందని పేర్కొన్నారు. అనంతరం ఇళయరాజా, కామకోటి ఒప్పందపత్రాలు మార్చుకున్నారు. పాత రోజులను ఇళయరాజా గుర్తు చేసుకుంటూ మద్రాస్‌కు సోదరుడితో చిన్నప్పుడు వచ్చానని, ఇప్పటివరకూ ఎవరి వద్దా ప్రత్యేకంగా సంగీతం నేర్చుకోలేదన్నారు. పట్టుదలతో కృషి చేస్తే ఇష్టమైన రంగంలో ఎవరైనా రాణించవచ్చని యువతకు సూచించారు. మరోవైపు ‘స్పిక్‌మాకే’ పేరిట తొమ్మిదో అంతర్జాతీయ సాంస్కృతిక కార్యక్రమాలు సోమవారం ఐఐటీఎంలో ప్రారంభమయ్యాయి. ఇవి వారం రోజులపాటు జరగనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని