బిష్కెక్‌లో పరిస్థితి ప్రశాంతం

బిష్కెక్‌లో ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని బుధవారం కిర్గిజ్‌స్థాన్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఇటీవల బిష్కెక్‌లోలో విదేశీ విద్యార్థులపై స్థానిక మూకలు భారీస్థాయిలో దాడులు చేసిన సంగతి తెలిసిందే.

Published : 23 May 2024 05:20 IST

భారత రాయబార కార్యాలయం ప్రకటన

దిల్లీ: బిష్కెక్‌లో ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని బుధవారం కిర్గిజ్‌స్థాన్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఇటీవల బిష్కెక్‌లోలో విదేశీ విద్యార్థులపై స్థానిక మూకలు భారీస్థాయిలో దాడులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో వసతి గృహాలకే పరిమితం కావాలని, బయటకు రావొద్దని భారత విద్యార్థులకు రాయబార కార్యాలయం సూచించింది. ప్రస్తుతం కిర్గిజ్‌స్థాన్‌లో 17 వేల మంది భారత విద్యార్థులు వివిధ కోర్సుల్లో విద్యను అభ్యసిస్తున్నారు. ఇందులో ఎక్కువమంది రాజధాని బిష్కెక్‌లోని విశ్వవిద్యాలయాల్లోనే చదువుతున్నారు. ఇటీవల జరిగిన హింసపై రాయబార కార్యాలయం ఆందోళన వ్యక్తం చేసింది. కిర్గిజ్‌ అధికారులు తీవ్రమైన చర్యలు తీసుకోవడంతో బిష్కెక్‌లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని