దేశంలో కొనసాగుతున్న భానుడి ప్రతాపం

దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో భానుడి ప్రతాపం ఇంకా కొనసాగుతోంది. గురువారం కూడా పలు రాష్ట్రాల్లో వడగాలులు వీచాయి.

Updated : 24 May 2024 05:24 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో భానుడి ప్రతాపం ఇంకా కొనసాగుతోంది. గురువారం కూడా పలు రాష్ట్రాల్లో వడగాలులు వీచాయి. పంజాబ్, హరియాణా, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్‌లలోని కనీసం 16 ప్రాంతాల్లో గురువారం గరిష్ఠ ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్‌ లేదా అంతకంటే ఎక్కువగా నమోదైనట్లు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. రాజస్థాన్‌లోని బాడ్‌మేడ్‌లో అత్యధికంగా 48.8 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది. పలు ప్రాంతాల్లో మరో ఐదు రోజులపాటు వడగాలుల ముప్పు కొనసాగుతుందని పేర్కొంది. దిల్లీలో మాత్రం గురువారం గరిష్ఠ ఉష్ణోగ్రత స్వల్పంగా తగ్గినట్లు తెలియజేసింది. 

కేరళను ముంచెత్తిన వర్షాలు 

కేరళలోని పలు ప్రాంతాల్లో గురువారం భారీ వర్షాలు కురిశాయి. తిరువనంతపురం, కొచ్చిన్, త్రిశ్శూర్, కోజికోడ్‌ సహా పలు ప్రధాన నగరాల్లో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఎర్నాకుళం, త్రిశ్శూర్‌ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ కూడా జారీ అయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని