ఇందౌర్‌ ధర్మాసనానికి జస్టిస్‌ దుప్పల వెంకటరమణ బదిలీ

మధ్యప్రదేశ్‌ హైకోర్టు జబల్‌పుర్‌ ధర్మాసనంలో సేవలందిస్తున్న జస్టిస్‌ దుప్పల వెంకటరమణ అదే రాష్ట్రంలోని ఇందౌర్‌ ధర్మాసనానికి బదిలీ అయ్యారు. జులై 1 నుంచి ఆయన ఇందౌర్‌ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తారు.

Published : 25 May 2024 05:54 IST

ఈనాడు, దిల్లీ: మధ్యప్రదేశ్‌ హైకోర్టు జబల్‌పుర్‌ ధర్మాసనంలో సేవలందిస్తున్న జస్టిస్‌ దుప్పల వెంకటరమణ అదే రాష్ట్రంలోని ఇందౌర్‌ ధర్మాసనానికి బదిలీ అయ్యారు. జులై 1 నుంచి ఆయన ఇందౌర్‌ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తారు. ఈ మేరకు మధ్యప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రవి మలిమఠ్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.  38 మంది న్యాయమూర్తులు సేవలందిస్తున్న మధ్యప్రదేశ్‌ హైకోర్టులో సీనియారిటీ పరంగా 24వ స్థానంలో ఉన్న జస్టిస్‌ దుప్పల వెంకటరమణ 2022 ఆగస్టు 4 నుంచి 2023 అక్టోబరు 30 వరకు ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. 2023 నవంబరు 1 నుంచి మధ్యప్రదేశ్‌ హైకోర్టు జబల్‌పుర్‌ ధర్మాసనానికి బదిలీ అయ్యారు. జులై 1 నుంచి ఇందౌర్‌ ధర్మాసనంలో బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ హైకోర్టుకు జబల్‌పుర్, ఇందౌర్, గ్వాలియర్‌లలో ధర్మాసనాలున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని