పరువు నష్టం కేసులో దోషిగా మేధాపాట్కర్‌

నర్మదా బచావో ఆందోళన్‌(ఎన్‌బీఏ) నాయకురాలు, సామాజిక వేత్త మేధాపాట్కర్‌ చిక్కుల్లో పడ్డారు. ఆమెపై దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా 23 సంవత్సరాల క్రితం దాఖలుచేసిన పరువు నష్టం కేసులో దోషిగా తేలారు.

Published : 25 May 2024 05:20 IST

దిల్లీ: నర్మదా బచావో ఆందోళన్‌(ఎన్‌బీఏ) నాయకురాలు, సామాజిక వేత్త మేధాపాట్కర్‌ చిక్కుల్లో పడ్డారు. ఆమెపై దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా 23 సంవత్సరాల క్రితం దాఖలుచేసిన పరువు నష్టం కేసులో దోషిగా తేలారు. ఈ మేరకు మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ రాఘవ్‌ శర్మ శుక్రవారం తీర్పు వెలువరించారు. చట్ట ప్రకారం ఆమెకు రెండేళ్ల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశముంది. తన పరువుకు భంగం కలిగేలా పత్రికా ప్రకటన విడుదల చేశారంటూ 2000 సంవత్సరంలో మేధాపాట్కర్‌పై వీకే సక్సేనా కేసు దాఖలు చేశారు. ఆ సమయంలో ఆయన నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌ (ఎన్‌సీసీఎల్‌) అనే ఎన్జీవోకు అధ్యక్షుడిగా ఉన్నారు. అప్పటి నుంచి వారి మధ్య న్యాయ వివాదం కొనసాగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని