కేదార్‌నాథ్‌లో తప్పిన హెలికాప్టర్‌ ప్రమాదం

ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్‌లో శుక్రవారం పెను ప్రమాదం తప్పింది. కేస్ట్రల్‌ ఏవియేషన్‌కు చెందిన హెలికాప్టర్‌ శుక్రవారం ఉదయం సిస్రీ నుంచి కేదార్‌నాథ్‌కు పైలట్, ఆరుగురు భక్తులతో బయలుదేరింది.

Published : 25 May 2024 05:20 IST

దేహ్రాదూన్‌: ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్‌లో శుక్రవారం పెను ప్రమాదం తప్పింది. కేస్ట్రల్‌ ఏవియేషన్‌కు చెందిన హెలికాప్టర్‌ శుక్రవారం ఉదయం సిస్రీ నుంచి కేదార్‌నాథ్‌కు పైలట్, ఆరుగురు భక్తులతో బయలుదేరింది. అనంతరం ఏడు గంటల సమయంలో హెలికాఫ్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే అప్రమత్తమైన పైలట్‌ హెలిప్యాడ్‌కు కొన్ని మీటర్ల దూరంలో దాన్ని సురక్షితంగా అత్యవసర ల్యాండింగ్‌ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని రుద్రప్రయాగ్‌ జిల్లా మేజిస్ట్రేట్‌ సౌరభ్‌ గాహర్వర్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు