గతిమాన్, మాల్వా ఎక్స్‌ప్రెస్‌ డ్రైవర్లపై సస్పెన్షన్‌ వేటు

హెచ్చరిక వేగ పరిమితి గంటకు 20 కి.మీ. ఉండగా 120 కి.మీ. వేగంతో రైళ్లను నడిపిన గతిమాన్, మాల్వా ఎక్స్‌ప్రెస్‌ డ్రైవర్లు, వారి సహాయకులను రైల్వేశాఖ సస్పెండ్‌ చేసింది. ఆగ్రా కంటోన్మెంట్‌ సమీపంలోని జాజౌ, మనియా రైల్వే స్టేషన్ల మధ్య నిర్దేశించిన వేగ పరిమితిని ఈ రెండు రైళ్ల సిబ్బంది ఇటీవల అతిక్రమించారు.

Published : 25 May 2024 05:49 IST

పరిమితికి మించి వేగమే కారణం

దిల్లీ: హెచ్చరిక వేగ పరిమితి గంటకు 20 కి.మీ. ఉండగా 120 కి.మీ. వేగంతో రైళ్లను నడిపిన గతిమాన్, మాల్వా ఎక్స్‌ప్రెస్‌ డ్రైవర్లు, వారి సహాయకులను రైల్వేశాఖ సస్పెండ్‌ చేసింది. ఆగ్రా కంటోన్మెంట్‌ సమీపంలోని జాజౌ, మనియా రైల్వే స్టేషన్ల మధ్య నిర్దేశించిన వేగ పరిమితిని ఈ రెండు రైళ్ల సిబ్బంది ఇటీవల అతిక్రమించారు. ఆ మార్గంలో గల ఓ రైల్వే వంతెన పునర్నిర్మాణ పనుల నేపథ్యంలో తాత్కాలికంగా వేగ పరిమితి విధించారు. ఈ సంఘటనను ఆగ్రా డివిజన్‌ పీఆర్‌వో ప్రశాంతి శ్రీవాస్తవ ధ్రువీకరించారు. ఘటనతో సంబంధం గల సిబ్బంది అందరిపైనా క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని