కలకత్తా హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంలో భాజపా పిటిషన్‌

ఎన్నికల ప్రవర్తన నియమావళి(ఎంసీసీ)ని ఉల్లంఘించేలా ఉన్న ప్రకటనలు ఇవ్వరాదని ఆదేశించిన కలకత్తా హైకోర్టు ఆదేశాలను భాజపా సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్‌ చేసింది. ఈ కేసును సత్వరమే విచారణకు చేపట్టాలంటూ శుక్రవారం జస్టిస్‌ బేలా ఎం.త్రివేది, జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌తో కూడిన సెలవు కాలీన ధర్మాసనానికి విజ్ఞప్తి చేసింది.

Published : 25 May 2024 05:50 IST

దిల్లీ: ఎన్నికల ప్రవర్తన నియమావళి(ఎంసీసీ)ని ఉల్లంఘించేలా ఉన్న ప్రకటనలు ఇవ్వరాదని ఆదేశించిన కలకత్తా హైకోర్టు ఆదేశాలను భాజపా సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్‌ చేసింది. ఈ కేసును సత్వరమే విచారణకు చేపట్టాలంటూ శుక్రవారం జస్టిస్‌ బేలా ఎం.త్రివేది, జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌తో కూడిన సెలవు కాలీన ధర్మాసనానికి విజ్ఞప్తి చేసింది. సోమవారమే విచారణ జరిపేలా చూడాలని న్యాయవాది సౌరభ్‌ మిశ్ర అభ్యర్థించగా పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది. అనంతరం ఈ నెల 27నాటి విచారణ జాబితాలో వ్యాజ్యాన్ని చేర్చారు. లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎంసీసీని ఉల్లంఘించే ప్రకటనలు ఇవ్వరాదని కలకత్తా హైకోర్టుకు చెందిన ఏకసభ్య ధర్మాసనం ఈ నెల 20న భాజపాని ఆదేశించింది. వ్యక్తిగత దాడికి దిగరాదని, ‘లక్ష్మణ రేఖ’ను పాటించాల్సిందేనంటూ జోక్యం చేసుకునేందుకు ద్విసభ్య ధర్మాసనం ఈ నెల 27న నిరాకరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని