వినియోగదారుల గౌరవమే కీలకం..

ఏ సంస్థకైనా వినియోగదారుల నుంచి లభించే గౌరవమే లాభాలుగా మారుతుంది.. ఫలితంగా అత్యుత్తమ నిపుణులు ఆ కంపెనీలో చేరేందుకు ఆసక్తి చూపుతారు.

Updated : 25 May 2024 06:30 IST

ఏ సంస్థకైనా వినియోగదారుల నుంచి లభించే గౌరవమే లాభాలుగా మారుతుంది.. ఫలితంగా అత్యుత్తమ నిపుణులు ఆ కంపెనీలో చేరేందుకు ఆసక్తి చూపుతారు. వ్యాపారంలో దీర్ఘకాలం కొనసాగాలనుకునేవారు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి.

ఎన్‌.ఆర్‌.నారాయణమూర్తి, ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకులు 


అదృష్టం కాదు, నిలకడ ముఖ్యం..

మనం ఎంత నిలకడగా పనులు చేస్తున్నామనే అంశంపైనే విజయావకాశాలు ఉంటాయి. వృత్తిలో, వ్యక్తిగతంగా ఉన్నత స్థాయి చేరుకోవడమనేది అదృష్టం మీద తక్కువగా, నిలకడ మీద ఎక్కువగా ఆధారపడుతుంది. 

మంచిగా మాట్లాడండి, రోజూ నడవండి. మంచి పుస్తకాలు చదవండి, మర్యాదగా మెలగండి, సమయపాలన పాటించండి. 

ఇచ్చిన మాట నిలబెట్టుకోండి, ఉదయాన్నే నిద్రలేవండి, తగినంత విశ్రాంతి తీసుకోండి. పనిమీద ధ్యాస పెట్టండి. ఓపికతో ఉండండి.. జీవితం, వృత్తి గొప్పగా ఉంటాయి. 

రాబిన్‌ శర్మ, వ్యక్తిత్వ వికాస నిపుణులు 


ఏఐని మన మేధతో పోల్చితే ఎలా!

ఏఐని మనిషితో పోల్చడాన్ని నేను అంగీకరించను. నా దృష్టిలో అదొక సాంకేతిక సాధనం మాత్రమే. మనుషులకు ఉపయోగించే పేర్లనీ, క్రియల్నీ దానికి ఉపయోగించడం తగదు. దానికి మేధ ఉంది కానీ, మనలాంటి మేధ లేదు. దీన్ని కృత్రిమ మేధ అని కాకుండా భిన్నమైన మేధ అనడం సబబేమో! మనకు కృత్రిమ మేధ ప్రతి సందర్భంలోనూ అవసరం లేదు. అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించుకుంటేనే దాంతో అనుబంధం సాఫీగా ఉంటుంది.

సత్య నాదెళ్ల, మైక్రోసాఫ్ట్‌ సీఈవో 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని