55 పులులు.. 17 చిరుతలు

మహారాష్ట్రలోని చంద్రపూర్‌ జిల్లాలో ఉన్న తాడోబా అభయారణ్యంలో బుద్ధ పూర్ణిమ వేళ వన్యప్రాణుల గణన చేపట్టారు. వివరాలను శనివారం అధికారులు వెల్లడించారు. అభయారణ్యంలోని బఫర్‌ క్షేత్రంలో 79 మంచెలు ఏర్పాటు చేసి 180 మంది వన్యప్రాణి ప్రేమికులను నియమించారు.

Published : 26 May 2024 04:55 IST

తాడోబా అభయారణ్యంలో వన్యప్రాణుల గణన
ఫర్‌ జోన్‌లో 1,917, కోర్‌ క్షేత్రంలో 3,092 ఉన్నట్లు గుర్తింపు

గణన సమయంలో కనిపించిన పులి

బల్లార్ష, న్యూస్‌టుడే: మహారాష్ట్రలోని చంద్రపూర్‌ జిల్లాలో ఉన్న తాడోబా అభయారణ్యంలో బుద్ధ పూర్ణిమ వేళ వన్యప్రాణుల గణన చేపట్టారు. వివరాలను శనివారం అధికారులు వెల్లడించారు. అభయారణ్యంలోని బఫర్‌ క్షేత్రంలో 79 మంచెలు ఏర్పాటు చేసి 180 మంది వన్యప్రాణి ప్రేమికులను నియమించారు. అధికారులు వెల్లడించిన లెక్కల ప్రకారం.. బఫర్‌ జోన్‌లో 1,917, కోర్‌ క్షేత్రంలోని అయిదు జోన్లలో కలిపి 3,092 వన్యప్రాణులు ఉన్నాయి. వాటిలో 55 పులులు, 17 చిరుతలు, 1,458 జింకలు, 65 ఎలుగుబంట్లు 1,059 కోతులతో పాటు ఇతర జంతువులను గుర్తించారు. ఇవికాకుండా లెక్కకు రాని మరిన్ని ప్రాణులు తిరుగుతున్నాయని ప్రకటించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని