ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ప్రైవేటు కేసు

ముస్లింలు చొరబాటుదారులని.. కాంగ్రెస్‌ను గెలిపిస్తే దేశంలో వారు ఎక్కువైపోతారంటూ ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల ప్రచార సభలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని బెంగళూరులోని హెబ్బాళ నివాసి జియా ఉర్‌ రెహమాన్‌ నొమాని (32) ఇక్కడి సివిల్‌ కోర్టులో ప్రైవేటు కేసు వేశారు.

Published : 27 May 2024 04:26 IST

బెంగళూరు(శివాజీనగర), న్యూస్‌టుడే: ముస్లింలు చొరబాటుదారులని.. కాంగ్రెస్‌ను గెలిపిస్తే దేశంలో వారు ఎక్కువైపోతారంటూ ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల ప్రచార సభలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని బెంగళూరులోని హెబ్బాళ నివాసి జియా ఉర్‌ రెహమాన్‌ నొమాని (32) ఇక్కడి సివిల్‌ కోర్టులో ప్రైవేటు కేసు వేశారు. రాజస్థాన్‌లో ఏప్రిల్‌ 21న నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మోదీ చేసిన ప్రసంగం రెండు మతాల మధ్య ద్వేషాన్ని సృష్టించేదిగా ఉందని అమృతహళ్లి ఠాణాలో ఇంతకుముంద]ు ఆయన ఫిర్యాదు చేశారు. ఈ విషయం కేంద్ర ఎన్నికల కమిషన్‌ పరిధిలోకి వస్తుందని పోలీసులు సూచించారు. ఈసీకి, నగర పోలీసు కమిషనర్‌కు ఈమెయిళ్ల ద్వారా నొమాని ఫిర్యాదు చేసినా, స్పందన లేకపోవడంతో న్యాయస్థానంలో ప్రైవేటు కేసు దాఖలు చేశారు. ఇది సిటీ సివిల్‌ కోర్టులో మంగళవారం విచారణకు రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని