అక్రమ ర్యాట్‌హోల్‌ గనిలో చిక్కుకున్న ముగ్గురు కార్మికులు

అస్సాంలోని తిన్‌సుకియా జిల్లాలో ఉన్న పట్‌కాయి కొండల్లో అక్రమ ర్యాట్‌హోల్‌ గనిలో ముగ్గురు కార్మికులు చిక్కుకున్నారు. కొండచరియలు విరిగిపడడంతో ఈ ఘటన జరిగిందని సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.

Published : 27 May 2024 05:47 IST

దిబ్రూగఢ్‌: అస్సాంలోని తిన్‌సుకియా జిల్లాలో ఉన్న పట్‌కాయి కొండల్లో అక్రమ ర్యాట్‌హోల్‌ గనిలో ముగ్గురు కార్మికులు చిక్కుకున్నారు. కొండచరియలు విరిగిపడడంతో ఈ ఘటన జరిగిందని సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. వీరిలో ఇద్దరు మేఘాలయకు చెందిన వారు కాగా, ఒకరు నేపాల్‌ వాసి అని పేర్కొన్నారు. నలుగురు వ్యక్తులు ఈ అక్రమ ర్యాట్‌హోల్‌ మైనింగ్‌కు పాల్పడ్డారని, ముగ్గురు గని లోపలికి వెళ్లగా, ఒకరు బొగ్గును తరలించే ప్రయత్నంలో ఉన్నార[ని ఆయన వివరించారు. అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ప్రమాదం సంభవించినట్లు సమాచారం అందిందని, కార్మికులు చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నామన్నారు. అధికార యంత్రాంగం రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టిందని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని