మరో వారం రోజులు బెయిల్‌ పొడిగించండి

కోర్టులో దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. తాను అకస్మాత్తుగా బరువు తగ్గానని, కీటోన్‌ స్థాయిలు అధికంగా ఉన్నాయని.. ఈ నేపథ్యంలో పెట్‌-సీటీ స్కాన్‌ తదితర పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారని ఆప్‌ నేత తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

Updated : 28 May 2024 05:16 IST

సుప్రీంకోర్టులో కేజ్రీవాల్‌ పిటిషన్‌

దిల్లీ: తన బెయిల్‌ గడువును మరో ఏడు రోజులు పొడిగించాలని కోరుతూ సుప్రీం కోర్టులో దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. తాను అకస్మాత్తుగా బరువు తగ్గానని, కీటోన్‌ స్థాయిలు అధికంగా ఉన్నాయని.. ఈ నేపథ్యంలో పెట్‌-సీటీ స్కాన్‌ తదితర పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారని ఆప్‌ నేత తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆదివారం దాఖలు చేసిన పిటిషన్‌లో తాను సుప్రీంకోర్టు సూచించిన జూన్‌ 2న కాకుండా జూన్‌ 9న లొంగిపోతానని కేజ్రీవాల్‌ తెలిపారు. వారం రోజుల పాటు వైద్య పరీక్షలు చేయించుకుంటానని, ఇందుకు అనుమతి మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

దిల్లీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న అరుణ్‌ రామచంద్రపిళ్లైకి మధ్యంతర బెయిల్‌ ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అందుకోసం తొలుత హైకోర్టుకు వెళ్లాలని జస్టిస్‌ ఏఎస్‌ ఓక, జస్టిస్‌ సతీష్‌చంద్రశర్మ నేతృత్వంలోని ధర్మాసనం సూచించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని