మ్యానిఫెస్టోల్లోని హామీలు అవినీతి పరిధిలోకి రావు

రాజకీయ పార్టీలు మ్యానిఫెస్టోల్లో ఇచ్చే హామీలు ఎన్నికల చట్టాల కింద అవినీతి పరిధిలోకి రావని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కర్ణాటకలోని చామరాజపేట ఎమ్మెల్యే జమీర్‌ అహ్మద్‌ఖాన్‌ (కాంగ్రెస్‌) ఎన్నికను సవాలు చేస్తూ ఆ నియోజకవర్గ ఓటరు శశాంక శ్రీధర దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.

Published : 28 May 2024 05:27 IST

సుప్రీంకోర్టు స్పష్టీకరణ 

దిల్లీ: రాజకీయ పార్టీలు మ్యానిఫెస్టోల్లో ఇచ్చే హామీలు ఎన్నికల చట్టాల కింద అవినీతి పరిధిలోకి రావని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కర్ణాటకలోని చామరాజపేట ఎమ్మెల్యే జమీర్‌ అహ్మద్‌ఖాన్‌ (కాంగ్రెస్‌) ఎన్నికను సవాలు చేస్తూ ఆ నియోజకవర్గ ఓటరు శశాంక శ్రీధర దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. నిరుడు కర్ణాటక ఎన్నికల వేళ విడుదల చేసిన మ్యానిఫెస్టోలో హస్తం పార్టీ ఇచ్చిన హామీలు.. ప్రజలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆర్థిక సహాయం అందించేవేనని పిటిషనర్‌ పేర్కొన్నారు. అలాంటి వాగ్దానాలు చేయడం ఎన్నికల్లో అవినీతికి పాల్పడటం కిందకే వస్తుందని వాదించారు. ఆ వాదన సరికాదని జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ కె.వి.విశ్వనాథన్‌ ధర్మాసనం తాజాగా అభిప్రాయపడింది. పిటిషన్‌ను కొట్టివేసింది. 

 భాజపా ప్రకటనలు ఆక్షేపణీయమే

తృణమూల్‌ కాంగ్రెస్‌ మీద, ఆ పార్టీ కార్యకర్తల మీద తీవ్రమైన ఆరోపణలతో భాజపా విడుదల చేసిన ప్రచార ప్రకటనలను నిలివేస్తూ కలకత్తా హైకోర్టు జారీచేసిన ఆదేశాల్లో జోక్యానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. ఆ ప్రచార ప్రకటనలు తీవ్ర ఆక్షేపణీయంగా ఉన్నాయని సోమవారం జస్టిస్‌ జె.కె.మహేశ్వరి, జస్టిస్‌ కె.వి.విశ్వనాథన్‌ ధర్మాసనం పేర్కొంది. దీంతో కోర్టు అనుమతితో భాజపా తరఫు న్యాయవాది పి.ఎస్‌.పత్వాలియా పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని