కోర్టులోనే ఏడ్చేసిన స్వాతి మాలీవాల్‌

ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్‌పై దాడి కేసులో నిందితుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌ కుమార్‌కు సోమవారం మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ న్యాయస్థానం బెయిల్‌ నిరాకరించింది.

Updated : 28 May 2024 05:10 IST

బిభవ్‌ కుమార్‌కు బెయిల్‌ తిరస్కరణ

దిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్‌పై దాడి కేసులో నిందితుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌ కుమార్‌కు సోమవారం మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ న్యాయస్థానం బెయిల్‌ నిరాకరించింది. అంతకుముందు వాదనల సందర్భంగా బిభవ్‌ కుమార్‌కు బెయిల్‌ ఇస్తే తనకు, తన కుటుంబానికి ప్రమాదం పొంచి ఉంటుందని స్వాతి మాలీవాల్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. తాను పోలీసులకు ఫిర్యాదు చేసిన నాటినుంచి రోజుకు రెండు మూడు విలేకరుల సమావేశాలు పెట్టి తాను భాజపా ఏజెంట్‌నంటూ ఆప్‌ తనపై దుష్ప్రచారం చేస్తోందని తెలిపారు. గతంలో ఆప్‌ వాలంటీర్‌గా పనిచేసిన ఓ యూట్యూబర్‌ తనపై ఏకపక్షంగా ఓ వీడియో పోస్టు చేసిన నాటినుంచి అత్యాచారం, హత్య బెదిరింపులు వస్తున్నాయని వెల్లడించారు. ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం.. ఈ నెల 13న సీఎం కేజ్రీవాల్‌ నివాసంలో మాలీవాల్‌ను ఛాతిపై, కడుపుపై, కటిభాగంలో బిభవ్‌ కొట్టారు. దీని ఆధారంగా ఈ నెల 18న ఆయనను పోలీసులు అరెస్టు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని