అంత్యక్రియలకు డబ్బుల్లేక.. మహిళ మృతదేహాన్ని రోడ్డుపై వదిలేసిన సహజీవన భాగస్వామి

పదేళ్లుగా తనతో సహజీవనం చేసిన భాగస్వామి మృతదేహాన్ని ఓ వ్యక్తి గోనెసంచిలో కుక్కి రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయిన ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. ఇందౌర్‌కు చెందిన ఓ వ్యక్తి (53) తన కంటే వయసులో నాలుగేళ్లు పెద్దదయిన మహిళతో సహజీవనం చేస్తూ వచ్చాడు.

Published : 28 May 2024 05:21 IST

ఇందౌర్‌: పదేళ్లుగా తనతో సహజీవనం చేసిన భాగస్వామి మృతదేహాన్ని ఓ వ్యక్తి గోనెసంచిలో కుక్కి రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయిన ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. ఇందౌర్‌కు చెందిన ఓ వ్యక్తి (53) తన కంటే వయసులో నాలుగేళ్లు పెద్దదయిన మహిళతో సహజీవనం చేస్తూ వచ్చాడు. మూడు రోజుల క్రితం ఆమె అనారోగ్యంతో కన్నుమూయగా.. ఆ మృతదేహాన్ని అతడు ఇంట్లోనే ఉంచుకున్నాడు. ఇంటి నుంచి దుర్వాసన వస్తోందని ఇరుగు పొరుగు వారు ఆరా తీయడం మొదలుపెట్టడంతో రాత్రివేళ ఓ గోనెసంచిలో ఆమె మృతదేహాన్ని కుక్కేసి ఇంటికి కాస్త దూరంలో రోడ్డుపై వదిలేసి ఎటో వెళ్లిపోయాడు. ఆదివారం ఈ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు పోస్టుమార్టంకు తరలించి దర్యాప్తు ప్రారంభించారు. ఆమె ఒంటిపై ఎటువంటి గాయాలు లేవని.. కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతూ మరణించినట్లు  పోస్టుమార్టంలో తేలిందని ఏసీపీ నందినీశర్మ తెలిపారు. ‘ఆ వ్యక్తినీ అదుపులోకి తీసుకొని విచారించాం. అంత్యక్రియలకు డబ్బుల్లేక ఇలా చేసినట్లు చెబుతున్నాడు. అతడి మానసిక స్థితి కూడా సరిగ్గా లేదనిపిస్తోంది’ అని వెల్లడించారు. ఆ మహిళ మృతదేహానికి పోలీసులే అంత్యక్రియలు నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని