పంజాబ్‌లో స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ..

పంజాబ్‌లోని తరణ్‌ తారణ్‌ ప్రాంతంలో స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ కొలువుదీరింది. నిర్మాణంలో ఉన్న భవనంపై స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీని ఏర్పాటు చేస్తుండడం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన వీడియోలో కనిపించింది.

Published : 28 May 2024 04:54 IST

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: పంజాబ్‌లోని తరణ్‌ తారణ్‌ ప్రాంతంలో స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ కొలువుదీరింది. నిర్మాణంలో ఉన్న భవనంపై స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీని ఏర్పాటు చేస్తుండడం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన వీడియోలో కనిపించింది. అలోక్‌ జైన్‌ అనే నెటిజన్‌ ఈ వీడియోను పంచుకుంటూ పంజాబ్‌లో ఓ ఇంటిపై స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ ఏర్పాటు చేశారు అని రాసుకొచ్చారు. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇకపై స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీని చూడాలంటే మనం న్యూయార్క్‌ వెళ్లాల్సిన అవసరం లేదని, ఈ ఇంటికి వెళితే సరిపోతుందని ఓ నెటిజన్‌ చమత్కరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని