ఆధునిక భారత వాస్తుశిల్పి నెహ్రూ: కాంగ్రెస్‌

భారతదేశ తొలి ప్రధానమంత్రి జవహార్‌ లాల్‌ నెహ్రూ 60వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ సోమవారం ఆయనకు ఘన నివాళి అర్పించింది. ఆధునిక భారతదేశానికి నెహ్రూ వాస్తుశిల్పి అని, ఆయన సాటిలేని సహకారం అందించకపోతే దేశ చరిత్ర పూర్తియ్యేది కాదని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు.

Updated : 28 May 2024 05:28 IST

దిల్లీ: భారతదేశ తొలి ప్రధానమంత్రి జవహార్‌ లాల్‌ నెహ్రూ 60వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ సోమవారం ఆయనకు ఘన నివాళి అర్పించింది. ఆధునిక భారతదేశానికి నెహ్రూ వాస్తుశిల్పి అని, ఆయన సాటిలేని సహకారం అందించకపోతే దేశ చరిత్ర పూర్తియ్యేది కాదని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. భారత్‌ను ఆర్థిక, శాస్త్రీయ, పారిశ్రామిక రంగాల్లో ముందుకు తీసుకెళ్లారని కొనియాడారు. ప్రజాస్వామ్యానికి నెహ్రూ నిబద్ధత కలిగిన సంరక్షకుడన్నారు. ‘‘దేశ రక్షణ, పురోగతి, ఐక్యమత్యమే ప్రజలందరి మతం’’, ‘‘దేశంలో కొందరు మాత్రమే ధనికంగా ఉండి, చాలామంది పేదలుగా ఉండే సమాజం వద్దు’’ అన్న నెహ్రూ మాటలను ఈ సందర్భంగా గుర్తుచేసిన ఆయన.. కాంగ్రెస్‌ పార్టీ అదే మార్గంలో పయనిస్తోందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎక్స్‌ వేదికగా నెహ్రూకు నివాళులర్పించారు. 

నెహ్రూ విలువలు ఎల్లప్పుడూ మార్గదర్శకం: రాహుల్‌ గాంధీ

‘స్వాతంత్య్రోద్యమం ద్వారా తన జీవితాన్ని దేశ నిర్మాణానికి నెహ్రూ ధారపోశారు. ప్రజాస్వామ్యాన్ని, సమాఖ్యవాదాన్ని నెలకొల్పారు. రాజ్యాంగానికి పునాదులేశారు. ఆయన విలువలు ఎల్లప్పుడూ మనకు మార్గదర్శకం’ అని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని