నాలుగోసారి అగ్నిబాణ్‌ ప్రయోగం వాయిదా

అగ్నికుల్‌ కాస్మోస్‌ సంస్థ రూపొందించిన అగ్నిబాణ్‌ రాకెట్‌ ప్రయోగం సాంకేతిక లోపంతో నాలుగోసారి వాయిదా పడింది.

Published : 29 May 2024 03:51 IST

శ్రీహరికోట, న్యూస్‌టుడే: అగ్నికుల్‌ కాస్మోస్‌ సంస్థ రూపొందించిన అగ్నిబాణ్‌ రాకెట్‌ ప్రయోగం సాంకేతిక లోపంతో నాలుగోసారి వాయిదా పడింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌లో ప్రైవేటు వేదిక నుంచి మంగళవారం ఉదయం 5.45 గంటలకు ఈ ప్రయోగాన్ని నిర్వహించాల్సి ఉంది. తొలుత కౌంట్‌డౌన్‌ ప్రక్రియలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఉదయం 9.25 గంటలకు రీషెడ్యూల్‌ చేశారు. షెడ్యూల్‌ చేసిన సమయానికి ఐదు సెకన్ల ముందు ఇగ్నైటర్‌ పనితీరును అంచనా వేయడానికి కౌంట్‌డౌన్‌ నిలిపివేస్తున్నట్లు తెలిపినా.. కాసేపటికి ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని