ఆశ్రమ మాజీ మేనేజర్‌ హత్య కేసులో డేరా బాబా నిర్దోషి

డేరాబాబాగా ప్రసిద్ధుడైన వివాదాస్పద గురువు డేరా సచ్చా సౌదా అధిపతి గుర్మీత్‌ రామ్‌ రహీంను ఆశ్రమ మాజీ మేనేజర్‌ రంజిత్‌ సింగ్‌ హత్య కేసులో నిర్దోషిగా పేర్కొంటూ మంగళవారం పంజాబ్‌-హరియాణా హైకోర్టు తీర్పిచ్చింది.

Published : 29 May 2024 03:53 IST

పంజాబ్‌-హరియాణా కోర్టు తీర్పు 

చండీగఢ్‌: డేరాబాబాగా ప్రసిద్ధుడైన వివాదాస్పద గురువు డేరా సచ్చా సౌదా అధిపతి గుర్మీత్‌ రామ్‌ రహీంను ఆశ్రమ మాజీ మేనేజర్‌ రంజిత్‌ సింగ్‌ హత్య కేసులో నిర్దోషిగా పేర్కొంటూ మంగళవారం పంజాబ్‌-హరియాణా హైకోర్టు తీర్పిచ్చింది. 2002లో రంజిత్‌ హత్యకు గురయ్యారు. ఆశ్రమంలో మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్నారని ఓ లేఖ అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ లేఖ రాసింది ఆశ్రమ మాజీ మేనేజర్‌ రంజిత్‌ సింగేనని ప్రచారం జరిగింది. తర్వాత ఆయన హత్యకు గురయ్యారు. దీనిపై దర్యాప్తు జరిపిన సీబీఐ.. గుర్మీత్‌ రామ్‌ రహీంతో పాటు మరో నలుగురిని నిందితులుగా పేర్కొంటూ ఛార్జిషీటు దాఖలు చేసింది. 2021లో చండీగఢ్‌లోని సీబీఐ కోర్టు వీరిని దోషులుగా ప్రకటించి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ కేసులో ఇప్పుడు వీరిని హైకోర్టు నిర్దోషులుగా తేల్చింది. అయితే ఆశ్రమంలోని ఇద్దరు మహిళలపై ఆత్యాచారం చేసిన కేసులో డేరా బాబాకు 2017లో 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఓ పాత్రికేయుడి హత్య కేసులోనూ 2019లో న్యాయస్థానం యావజ్జీవ శిక్ష విధించింది. ప్రస్తుతం రోహ్‌తక్‌లోని సునారియా జైలులో డేరాబాబా ఈ శిక్షలు అనుభవిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని