సూది మింగిన బాలిక.. శస్త్రచికిత్స అవసరం లేకుండానే తొలగించిన వైద్యులు

తమిళనాడులోని తంజావూర్‌లో 14 ఏళ్ల బాలిక పొరపాటున సూది మింగేసింది. వైద్యులు శస్త్రచికిత్స అవసరం లేకుండా జాగ్రత్తగా ఆ సూదిని తొలగించారు.

Published : 29 May 2024 09:05 IST

బాలిక ఊపిరితిత్తుల్లో ఉన్న సూది 

చెన్నై (ఆర్కేనగర్‌), న్యూస్‌టుడే: తమిళనాడులోని తంజావూర్‌లో 14 ఏళ్ల బాలిక పొరపాటున సూది మింగేసింది. వైద్యులు శస్త్రచికిత్స అవసరం లేకుండా జాగ్రత్తగా ఆ సూదిని తొలగించారు. కుంభకోణానికి చెందిన ఆ బాలిక దుస్తులు వేసుకుంటూ సూది మింగేసింది. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో తల్లిదండ్రులు అంబులెన్స్‌లో తంజావూర్‌లోని శ్రీకామాక్షి మెడికల్‌ సెంటర్‌ ఆస్పత్రికి తరలించారు. వైద్యపరీక్షలు చేయగా ఊపిరితిత్తుల్లో సూది ఇరుక్కుందని గుర్తించారు. ఊపిరితిత్తుల వైద్యనిపుణుడు డాక్టర్‌ అరుణ్‌ నేతృత్వంలోని బృందం 3.23 నిమిషాల్లో 4 సెం.మీ. పొడవైన సూదిని బ్రాంకోస్కొపీ ద్వారా బయటకు తీసి, పాప ప్రాణాలు కాపాడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని