సుప్రీంకోర్టు భవనాన్ని కూల్చొద్దని పిటిషన్‌

దేశ రాజధానిలోని సుప్రీం కోర్టు భవనాన్ని కూల్చొద్దనీ, ఆ మేరకు కేంద్ర ప్రభుత్వంతోపాటు సంబంధిత రిజిస్ట్రీకి ఆదేశాలివ్వాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలైంది.

Published : 29 May 2024 05:04 IST

దిల్లీ: దేశ రాజధానిలోని సుప్రీం కోర్టు భవనాన్ని కూల్చొద్దనీ, ఆ మేరకు కేంద్ర ప్రభుత్వంతోపాటు సంబంధిత రిజిస్ట్రీకి ఆదేశాలివ్వాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలైంది. భారీ కట్టడాన్ని కూల్చివేసి, ఆ స్థానంలో మరోటి నిర్మించే బదులు.. దాన్ని అలాగే ఉంచి ఇంకోటి కట్టడం మేలని కేకే రమేష్‌ అనే వ్యక్తి సూచించారు. ‘స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో నిర్మించిన ముఖ్యమైన కట్టడాల్లో సుప్రీం కోర్టు భవనం ఒకటి. దాన్ని కూల్చివేస్తే చరిత్రను భావితరాలకు దూరం చేసినట్లే. నేటికీ అద్దె భవనాల్లో కొనసాగుతోన్న అనేక కోర్టులు, ట్రైబ్యునళ్లు, ప్రభుత్వ కార్యాలయాలను ఇక్కడికి తరలించవచ్చు’ అని ఆయన పేర్కొన్నారు. ‘ప్రస్తుత భవనంలో 17 కోర్టు, రెండు రిజిస్ట్రీ గదులు ఉన్నాయి. దాన్ని కూల్చివేసి రూ.800 కోట్లతో కొత్త భవనం నిర్మించాలని యోచిస్తున్నారు. అందులో 27 కోర్టు, నాలుగు రిజిస్ట్రీ గదులు కట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు వేసింది. కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నందున పదేళ్ల తర్వాత అవి కూడా సరిపోవు’ అని పిటిషనర్‌ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని