పర్వతారోహకుడి ప్రపంచ రికార్డు

భారత పర్వతారోహకుడు సత్యదీప్‌ గుప్తా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఎవరెస్టు, లోత్సీ పర్వతాలను ఒకే సీజన్‌లో అధిరోహించడంతోపాటు కేవలం 11 గంటల 15 నిమిషాల వ్యవధిలోనే ఆ యాత్రను పూర్తి చేయడం విశేషం.

Updated : 29 May 2024 05:39 IST

కాఠ్‌మండూ: భారత పర్వతారోహకుడు సత్యదీప్‌ గుప్తా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఎవరెస్టు, లోత్సీ పర్వతాలను ఒకే సీజన్‌లో అధిరోహించడంతోపాటు కేవలం 11 గంటల 15 నిమిషాల వ్యవధిలోనే ఆ యాత్రను పూర్తి చేయడం విశేషం. ప్రపంచంలోనే ఎత్తయిన 8,516 మీటర్ల ఎవరెస్టును సోమవారం మధ్యాహ్నం, నాలుగో ఎత్తయిన 8849 మీటర్ల లోత్సీ శిఖరాన్ని అదే రోజు అర్ధరాత్రి వరకు చుట్టేశారు. ఒకే సీజన్‌లో ఇలా రెండు ఘనతలు సాధించిన వ్యక్తిగా గుప్తా ప్రపంచ రికార్డు సృష్టించినట్లు అడ్వెంచర్‌ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు