రుద్రమ్‌-2 క్షిపణి పరీక్ష విజయవంతం

గగనతలం నుంచి నేలపైనున్న లక్ష్యాలను ఛేదించగల రుద్రమ్‌-2 అనే క్షిపణిని భారత్‌ విజయవంతంగా పరీక్షించింది.

Published : 30 May 2024 04:23 IST

బాలేశ్వర్‌: గగనతలం నుంచి నేలపైనున్న లక్ష్యాలను ఛేదించగల రుద్రమ్‌-2 అనే క్షిపణిని భారత్‌ విజయవంతంగా పరీక్షించింది. వైమానిక దళానికి చెందిన సుఖోయ్‌-30 ఎంకేఐ యుద్ధవిమానం నుంచి ఈ ప్రయోగం జరిగింది. ఒడిశాలోని బాలేశ్వర్‌ తీరానికి చేరువలో బుధవారం ఉదయం 11.30గంటలకు ఈ పరీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా క్షిపణికి సంబంధించిన చోదక వ్యవస్థతోపాటు, నియంత్రణ, గైడెన్స్‌ అల్గోరిథమ్‌ల పనితీరును శాస్త్రవేత్తలు పరిశీలించారు. పరీక్ష లక్ష్యాలన్నీ నెరవేరాయని వారు తెలిపారు. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) రూపొందించిన అనేక ఆధునిక పరిజ్ఞానాలను ఈ క్షిపణిలో అమర్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని