ప్రజ్వల్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత

మహిళలపై లైంగిక వేధింపులు, దౌర్జన్యాల ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటకలోని హాసన ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్న ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు తిరస్కరించింది.

Updated : 30 May 2024 05:07 IST

బెంగళూరు రాగానే అరెస్టు చేసే అవకాశం

బెంగళూరు: మహిళలపై లైంగిక వేధింపులు, దౌర్జన్యాల ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటకలోని హాసన ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్న ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. విదేశాల నుంచి ప్రజ్వల్‌ మే 30న బెంగళూరుకు వచ్చేందుకు విమాన టికెట్లు బుక్‌ చేసుకున్నట్లు తెలిసింది. 31న బెంగళూరులో దిగగానే సిట్‌ అధికారులు విమానాశ్రయంలోనే అరెస్టు చేస్తారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు కిడ్నాప్‌ కేసులో అరెస్టు చేస్తారనే భయంతో ప్రజ్వల్‌ తల్లి భవానీ రేవణ్న కూడా ప్రత్యేక కోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై బుధవారం కోర్టులో విచారణ జరిగింది. ఇదే కేసులో ఆమె భర్త హెచ్‌.డి.రేవణ్న మధ్యంతర బెయిల్‌నూ రద్దు చేయాలని సిట్‌ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం భవానీకి ముందస్తు బెయిల్‌పై తీర్పును మే 31కి రిజర్వు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు