‘టగ్‌ ఆఫ్‌ వార్‌’లో చైనాపై భారత్‌ విజయం

చైనా సైనికులతో ఇటీవల జరిగిన ‘టగ్‌ ఆఫ్‌ వార్‌’లో భారత జవాన్లు విజయం సాధించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Published : 30 May 2024 05:51 IST

ఖార్టూమ్‌: చైనా సైనికులతో ఇటీవల జరిగిన ‘టగ్‌ ఆఫ్‌ వార్‌’లో భారత జవాన్లు విజయం సాధించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది నిజమేనని భారత సైనిక వర్గాలు సైతం ధ్రువీకరించాయి. ‘ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ కార్యక్రమం’లో భాగంగా భారత్‌కు చెందిన కొంత మంది సైనికులు సూడాన్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న చైనా సైనికులతో స్నేహపూర్వకంగా ‘టగ్‌ ఆఫ్‌ వార్‌’ నిర్వహించగా భారత జవాన్లు విజయం సాధించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని