పాతాళగంగ భగభగ!

భూగర్భ జలాల ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ శతాబ్దం చివరినాటికి అవి 2-3.5 డిగ్రీల సెల్సియస్‌ మేర వేడెక్కుతాయని చెబుతున్నారు.

Published : 06 Jun 2024 05:21 IST

ఈ శతాబ్దం చివరినాటికి 3 డిగ్రీల మేర వేడెక్కనున్న భూగర్భజలాలు

దిల్లీ: భూగర్భ జలాల ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ శతాబ్దం చివరినాటికి అవి 2-3.5 డిగ్రీల సెల్సియస్‌ మేర వేడెక్కుతాయని చెబుతున్నారు. దీనివల్ల ఈ నీటి నాణ్యతకు ముప్పు ఏర్పడుతుందని పేర్కొన్నారు. దీనికితోడు పర్యావరణ వ్యవస్థలకూ ముప్పు ఏర్పడుతుందని వివరించారు. భూమిపై జీవం మనుగడకు ఈ భూగర్భ జలాలు చాలా కీలకమని తెలిపారు. జర్మన్, బ్రిటన్‌ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. వీరి నివేదిక ప్రకారం.. 

  • సెంట్రల్‌ రష్యా, ఉత్తర చైనా, ఉత్తర అమెరికాలోని కొన్ని ప్రాంతాలు, దక్షిణ అమెరికాలోని అమెజాన్‌ వర్షాధార అడవుల్లో భూగర్భజలాలు ఎక్కువగా వేడెక్కుతాయి. 
  • భూగర్భ జలాలు వేడెక్కడం వల్ల.. వాటిపై ఆధారపడ్డ పర్యావరణ వ్యవస్థలకు తీవ్ర నష్టం జరుగుతుంది. వేసవి సమయంలో నదుల్లో ప్రవాహాలకు భూగర్భ జలాలే ఆధారం. వేడి నీటిలో ఆక్సిజన్‌ ఎక్కువగా ఉండదు. 
  • ఈ శతాబ్దం చివరినాటికి.. నిర్దేశిత ప్రమాణాల కన్నా ఎక్కువగా వేడెక్కిన భూగర్భజలాలు కలిగిన ప్రాంతాల్లో 60 కోట్ల మంది వరకూ నివసిస్తుండొచ్చు.
  • తాగునీటి ఉష్ణోగ్రతలకు సంబంధించి ప్రస్తుతం 18 దేశాల్లోనే మార్గదర్శకాలు ఉన్నాయి. 
  • భూగర్భ జలాలు వేడెక్కడం వల్ల వ్యాధికారక సూక్ష్మజీవులు ఎక్కువగా వృద్ధి చెందే అవకాశం ఉంది. దీనివల్ల నీటి నాణ్యత, ప్రజారోగ్యం ప్రమాదంలో పడిపోతుంది. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని