నరేంద్ర మోదీకి అభినందనలు

సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన ప్రధాని మోదీకి అమెరికా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్‌ చైనా సహా పలు ప్రపంచ దేశాలు అభినందనలు తెలిపాయి. ఈ సందర్భంగా ఆయా దేశాధినేతలంతా భారత్‌తో సంబంధాలను బలోపేతం చేసుకోవాలన్న ఆకాంక్షను వెల్లడించారు.

Published : 06 Jun 2024 05:22 IST

శుభాకాంక్షలు తెలిపిన బైడెన్‌ సహా పలు ప్రపంచ దేశాధినేతలు

వాషింగ్టన్‌: సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన ప్రధాని మోదీకి అమెరికా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్‌ చైనా సహా పలు ప్రపంచ దేశాలు అభినందనలు తెలిపాయి. ఈ సందర్భంగా ఆయా దేశాధినేతలంతా భారత్‌తో సంబంధాలను బలోపేతం చేసుకోవాలన్న ఆకాంక్షను వెల్లడించారు. ‘‘విజయం సాధించిన ప్రధాని మోదీకి, ఎన్డీయే కూటమికి శుభాకాంక్షలు. ఈ చరిత్రాత్మక ఎన్నికలో 65 కోట్ల మంది పాల్గొన్నారు. మన రెండు దేశాల మధ్య స్నేహం భవిష్యత్తులో ఇంకా పెరగనుంది’’ అని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ తెలిపారు. మోదీతో తాను మాట్లాడి శుభాకాంక్షలు తెలిపానని బ్రిటన్‌ ప్రధాని సునాక్‌ పేర్కొన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ కూడా ఫోన్‌ చేసి మోదీకి అభినందనలు తెలిపారు. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకొని భవిష్యత్తువైపు అడుగులు వేయాలని తాము భావిస్తున్నట్లు చైనా విదేశాంగశాఖ ప్రతినిధి మావో నింగ్‌ తెలిపారు. ఆరోగ్యకరమైన, స్థిరమైన భారత్‌-చైనా బంధం ఇరు దేశాలకు ప్రయోజనకరమని పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు ‘ఎక్స్‌’ వేదికగా మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. భారత్‌-ఇజ్రాయెల్‌ సంబంధాలు కొత్త శిఖరాలకు చేరుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. మోదీని అభినందించిన వారిలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమ సింఘే, నేపాల్‌ ప్రధాని పుష్ప కమాల్‌ దహల్, మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు, భూటాన్, మారిషస్, జమైకా ప్రధానులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని