భారత ఓటర్లు మోదీని మందలించారు: వాషింగ్టన్‌ పోస్ట్‌

భారత్‌ సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ప్రపంచంలోని ప్రముఖ పత్రికలు స్పందించాయి. లోక్‌సభ ఎన్నికల్లో భాజపా స్పష్టమైన ఆధిక్యం సాధించనప్పటికీ..

Published : 06 Jun 2024 05:22 IST

దిల్లీ: భారత్‌ సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ప్రపంచంలోని ప్రముఖ పత్రికలు స్పందించాయి. లోక్‌సభ ఎన్నికల్లో భాజపా స్పష్టమైన ఆధిక్యం సాధించనప్పటికీ.. ప్రధాని మోదీ మూడోసారి అధికారాన్ని కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నారంటూ అమెరికా మీడియా సంస్థ ‘ది వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌’ కథనం పేర్కొంది. మోదీ ప్రభంజనానికి బ్రేకులు పడ్డాయని ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ అభిప్రాయపడింది. ఎన్నికల ఫలితాలు మోదీని, ఆయన పార్టీని దిగ్భ్రమకు గురిచేశాయని సీఎన్‌ఎన్‌ పేర్కొంది. ఈ ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీని సాధించలేకపోయారని తన కథనంలో విశ్లేషించింది. భారత ఓటర్లు మోదీని మందలించారని వాషింగ్టన్‌ పోస్టు పేర్కొంది. హిందుత్వ వాదులకు ఎదురుదెబ్బ తగిలిందని తెలిపింది. మోదీ మెజార్టీ కోల్పోయారని బ్రిటన్‌ మీడియా సంస్థ ‘ది గార్డియన్‌’ అభిప్రాయపడింది. అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే భాగస్వామ్య పక్షాల మద్దతు అవసరం అని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని