150 అత్యుత్తమ వర్సిటీల్లో ఐఐటీ బాంబే, ఐఐటీ దిల్లీ

ప్రపంచంలోని 150 అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో ఐఐటీ బాంబే, ఐఐటీ దిల్లీ చోటు సంపాదించుకున్నాయి. లండన్‌కు చెందిన ఉన్నత విద్యా విశ్లేషకుడు క్వాక్వెరెల్లీ సైమండ్స్‌(క్యూఎస్‌) బుధవారం ప్రకటించిన ‘వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్‌-2025’ వివరాల ప్రకారం.

Published : 06 Jun 2024 05:25 IST

దిల్లీ: ప్రపంచంలోని 150 అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో ఐఐటీ బాంబే, ఐఐటీ దిల్లీ చోటు సంపాదించుకున్నాయి. లండన్‌కు చెందిన ఉన్నత విద్యా విశ్లేషకుడు క్వాక్వెరెల్లీ సైమండ్స్‌(క్యూఎస్‌) బుధవారం ప్రకటించిన ‘వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్‌-2025’ వివరాల ప్రకారం..అమెరికాకు చెందిన మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎంఐటీ)  అత్యుత్తమ విశ్వవిద్యాలయంగా 13వ సారి తన ప్రథమ స్థానాన్ని నిలబెట్టుకుంది. మన దేశానికి సంబంధించి.. గతేడాది 149వ ర్యాంకు సాధించిన ఐఐటీ బాంబే ఈసారి 31 ర్యాంకులు ఎగబాకి 118వ స్థానంలో నిలిచింది. ఐఐటీ దిల్లీ 47 పాయింట్లు మెరుగుపర్చుకుని 150వ స్థానం సాధించింది. గౌరవనీయ విశ్వవిద్యాలయాల ర్యాంకింగుల్లో..పట్టభద్రులకు మెరుగైన ఉపాధి కల్పిస్తున్న దిల్లీ ఐఐటీ 44 స్థానంలో నిలిచినట్లు క్యూఎస్‌ జాబితా పేర్కొంది. భారతదేశ విశ్వవిద్యాలయాల్లో సుస్థిరత కార్యక్రమాలను బలోపేతం చేయాల్సిన అవసరముందని ఈ నివేదిక సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని