పోటీ తీవ్రత వల్లే కట్ ఆఫ్ మార్కుల పెంపు...
వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్-యూజీకి సంబంధించి కట్ ఆఫ్ మార్కుల పెంపును, అగ్రశేణి టాపర్ల సంఖ్య పెరగడాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సమర్థించుకుంది.
నీట్లో టాపర్ల సంఖ్యా పెరిగింది
విమర్శలపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వివరణ
దిల్లీ: వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్-యూజీకి సంబంధించి కట్ ఆఫ్ మార్కుల పెంపును, అగ్రశేణి టాపర్ల సంఖ్య పెరగడాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సమర్థించుకుంది. అభ్యర్థుల పోటీతత్వంతో పాటు పరీక్ష రాసిన వారి సంఖ్య అధికం కావడమూ దీనికి కారణమని పేర్కొంది. పరీక్ష నిర్వహణలో, సంస్థ నైతిక నిష్ఠ విషయంలో ఎక్కడా రాజీపడలేదని స్పష్టం చేసింది. మే 5న దేశవ్యాప్తంగా 4,750 కేంద్రాల్లో నిర్వహించిన నీట్లో అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలపై సంస్థ గురువారం ఈ వివరణ ఇచ్చింది. 2023లో 20.38లక్షల మంది నీట్‌కు సన్నద్ధం కాగా 2024లో వారి సంఖ్య 23.33లక్షలకు పెరిగిందని ఎన్టీఏ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అభ్యర్థుల సంఖ్యతో పాటు అధిక స్కోరు సాధించే వారి సంఖ్యా పెరగడం సహజమేనన్నారు. కొన్ని కేంద్రాల్లో పరీక్ష నిర్వహణలో జాప్యంపై 1,563 మంది అభ్యర్థులు హైకోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారని, వారికి కలిగిన నష్టాన్ని భర్తీ చేయడం కోసం గ్రేస్ మార్కులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఇలా గ్రేస్ మార్కులు పొందిన వారిలో మైనస్ 20 నుంచి 720 వరకు మార్కులు వచ్చిన విద్యార్థులూ ఉన్నారని వివరించారు. ఒకేవిధమైన టాప్ ర్యాంకును అత్యధిక స్థాయిలో 67 మంది సాధించడం, వీరిలో ఆరుగురు హరియాణాలోని ఒకే కేంద్రంలో పరీక్ష రాసినవారు కావడంపైనా ఆరోపణలు వచ్చాయి. అయితే, వీటిని ఎన్టీఏ తోసిపుచ్చింది. ఎన్సీఈఆర్టీ నూతన పాఠ్యపుస్తకాల ప్రకారం నీట్ ప్రశ్నపత్రం రూపొందిందని, కొందరు విద్యార్థులు ఎన్సీఈఆర్టీ పాత పాఠ్యపుస్తకాలతో పరీక్షకు సన్నద్ధమయ్యారని తెలిపారు. వారి నుంచి అభ్యర్థనలు రావడంతో కమిటీ పరిశీలించి వారికి 5 గ్రేస్ మార్కులు కలిపిందన్నారు. దీనివల్ల 44 మంది మార్కులు 715 నుంచి 720కి పెరిగాయని, టాపర్ల సంఖ్య అధికం కావడానికి ఇది కూడా ఓ కారణమని ఎన్టీఏ అధికారులు వివరించారు. నీట్ ప్రశ్నపత్రాల లీకేజీతో పాటు ఫలితాల వెల్లడి వరకు పలు అక్రమాలు జరిగాయంటూ కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. నీట్ నిర్వహణలో పారదర్శకత లోపించిందంటూ పలువురు విద్యార్థులు కూడా ఎన్టీఏ తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్‌లో రకుల్‌ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కొత్త హెడ్‌కోచ్‌గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
-
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్