స్వర్ణదేవాలయంలో ఖలిస్థాన్‌ నినాదాలు

పంజాబ్‌లో మరోసారి వేర్పాటువాద ఖలిస్థాన్‌ అంశం తెరపైకి వచ్చింది. అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయంలో పాగా వేసిన తీవ్రవాదుల ఏరివేతకు ఉద్దేశించిన ఆపరేషన్‌ బ్లూస్టార్‌కు 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గురువారం అక్కడ భారీ కార్యక్రమం జరిగింది.

Published : 07 Jun 2024 05:12 IST

అమృత్‌సర్‌: పంజాబ్‌లో మరోసారి వేర్పాటువాద ఖలిస్థాన్‌ అంశం తెరపైకి వచ్చింది. అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయంలో పాగా వేసిన తీవ్రవాదుల ఏరివేతకు ఉద్దేశించిన ఆపరేషన్‌ బ్లూస్టార్‌కు 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గురువారం అక్కడ భారీ కార్యక్రమం జరిగింది. దీనిలో పాల్గొన్న వివిధ సంస్థల కార్యకర్తలు ఖలిస్థాన్‌ అనుకూల నినాదాలు చేశారు. హత్యకు గురైన తీవ్రవాదులు జర్నైల్‌ సింగ్‌ భింద్రాన్‌వాలే, హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ చిత్రాలను ప్రదర్శించారు. స్వర్ణదేవాలయంలోని అకాల్‌ తఖ్త్‌ వద్ద భారీ సంఖ్యలో గుమిగూడిన ప్రదర్శనకారుల నినాదాలతో ఆ ప్రాంగణం మార్మోగింది. మాజీ ఎంపీ ధియాన్‌ సింగ్‌ మంద్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిరసనకారులను ఉద్దేశించి అకాల్‌ తఖ్త్‌ అధినేత జ్ఞానీ రఘువీర్‌ సింగ్‌ ప్రసంగించారు. లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్రులుగా పంజాబ్‌ నుంచి గెలిచిన అమృత్‌పాల్‌ సింగ్, సరబ్‌జీత్‌ సింగ్‌.. చాలా కాలంగా జైళ్లలో ఉన్న సిక్కు ఖైదీల విడుదలకు పార్లమెంటులో తమ గళం వినిపించాలని ఆయన కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని