ఈవీఎంల ద్వారా ఓట్లు వేసినవారు 65.79%

ముగిసిన సార్వత్రిక సమరంలో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల (ఈవీఎం) ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఓటర్లలో 65.79% మంది తమ హక్కును వినియోగించుకున్నారని కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది.

Published : 07 Jun 2024 05:12 IST

తపాలా బ్యాలెట్లు దీనికి అదనం: ఈసీ 

దిల్లీ: ముగిసిన సార్వత్రిక సమరంలో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల (ఈవీఎం) ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఓటర్లలో 65.79% మంది తమ హక్కును వినియోగించుకున్నారని కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది. దీనిలో తపాలా బ్యాలెట్లను కలపలేదు. అవి కూడా కలిపితే తుది గణాంకాలు మారే అవకాశం ఉందని ఈసీ తెలిపింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి అందుతున్న పోస్టల్‌ బ్యాలెట్ల వివరాలను క్రోడీకరించిన తర్వాత మొత్తం గణాంకాలను వివరంగా వెల్లడిస్తామని ఒక ప్రకటనలో పేర్కొంది. ఎన్నికల్లో చిట్టచివరిదైన ఏడో దశలో 63.88% పోలింగ్‌ నమోదైందని, అన్నింటిలోనూ నాలుగోదశలో అత్యధికంగా 69.16% పోలింగ్‌ జరిగిందని వెల్లడించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 67.40% పోలింగ్‌ నమోదైంది. ఆ ఎన్నికల నాటికి 91.20 కోట్ల మంది ఓటర్లు ఉంటే తాజా ఎన్నికల్లో వారి సంఖ్య 96.88 కోట్లకు పెరిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని