నీటితో రాజకీయాలు వద్దు

తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న దిల్లీ నగరానికి వెంటనే 137 క్యుసెక్కుల మిగులు జలాలను విడుదల చేయాలని హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వాన్ని గురువారం సుప్రీంకోర్టు ఆదేశించింది.

Published : 07 Jun 2024 05:13 IST

దిల్లీకి తక్షణమే మిగులు జలాలు విడుదల చేయండి
హిమాచల్‌ప్రదేశ్‌కు సుప్రీంకోర్టు ఆదేశం

దిల్లీ: తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న దిల్లీ నగరానికి వెంటనే 137 క్యుసెక్కుల మిగులు జలాలను విడుదల చేయాలని హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వాన్ని గురువారం సుప్రీంకోర్టు ఆదేశించింది. శుక్రవారానికల్లా ఆ నీరు దేశ రాజధాని నగరానికి చేరుకునేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. నీటితో రాజకీయాలు తగవని  జస్టిస్‌ పి.కె.మిశ్ర, జస్టిస్‌ కె.వి.విశ్వనాథన్‌లతో కూడిన సెలవుకాల ధర్మాసనం హితవు పలికింది. తమ వద్ద ఉన్న యమునా నది మిగులు జలాలను విడుదల చేయడానికి అభ్యంతరం లేదంటూ హిమాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ఇచ్చిన సమాధానాన్ని ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. నీటి విడుదల సమాచారాన్ని ముందుగా హరియాణా రాష్ట్రానికి తెలియజేయాలని పేర్కొంది. తద్వారా హత్నికుంద్‌ బ్యారేజీ నుంచి వాజీరాబాద్‌కు ఎలాంటి ఆటంకం లేకుండా నీటి ప్రవాహం చేరుకునేందుకు వీలవుతుందని తెలిపింది. ఈ నెల 10న స్థాయీ నివేదికను కోర్టుకు సమర్పించాలని హిమాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వానికి సూచించింది. ఈ నీటిని వృథా చేయకుండా వినియోగించుకోవాలని దిల్లీ ప్రభుత్వానికి ధర్మాసనం సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని