పండ్లు తెంపుతున్నాయని.. ప్రాణాలు తోడేశారు!

కొన్ని ఘటనలు చూస్తే.. కరుణ, ప్రేమ వంటి గుణాలు మనిషిలో కనుమరుగయ్యాయా అని సందేహం వస్తుంది. అలాంటి ఘటనే కర్ణాటకలోని నరసింహరాజపురలో జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు 30 కోతులను కొట్టి చంపి, రోడ్డుపక్కన గుట్టగా పడేశారు.

Published : 08 Jun 2024 05:58 IST

కొన్ని ఘటనలు చూస్తే.. కరుణ, ప్రేమ వంటి గుణాలు మనిషిలో కనుమరుగయ్యాయా అని సందేహం వస్తుంది. అలాంటి ఘటనే కర్ణాటకలోని నరసింహరాజపురలో జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు 30 కోతులను కొట్టి చంపి, రోడ్డుపక్కన గుట్టగా పడేశారు. ఆ మార్గంలో వెళ్లే ప్రయాణికులు ఈ హృదయవిదారక దృశ్యం చూసిన చలించిపోయారు. నరసింహరాజపురలో కోతుల బెడద ఎక్కువగా ఉంది. ఇక్కడి తోటల్లో పడి పండ్లు తెంపేస్తున్నాయని కొన్ని రోజులుగా రైతులు ఇబ్బందులుపడుతున్నారు. ఈ క్రమంలో కొందరు కోతులకు మత్తు మందు కలిపిన అరటి పండ్లు పెట్టారు. అవి తిని కోతులు స్పృహ తప్పాక వాటిని కొట్టి చంపారు. చనిపోయిన వాటన్నింటికీ రహదారి పక్కన పడేశారు. స్థానికుల సమాచారంతో అటవీ శాఖ సిబ్బంది, ఎన్‌ఆర్‌ పుర ఠాణా పోలీసులు వచ్చి పరిశీలించారు. అన్నింటికీ తలపై ఒకే రకమైన గాయాలు ఉండటంతో కావాలనే కర్రలతో కొట్టి చంపారని పోలీసులు వెల్లడించారు.  

న్యూస్‌టుడే, చిక్కమంగళూరు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని