మహిళా కానిస్టేబుల్‌కు మద్దతుగా రైతు సంఘాలు

బాలీవుడ్‌ నటి, భాజపా ఎంపీ కంగనా రనౌత్‌ను చండీగఢ్‌ విమానాశ్రయంలో చెంపదెబ్బ కొట్టిన సీఐఎస్‌ఎఫ్‌ మహిళా కానిస్టేబుల్‌ కుల్వీందర్‌ కౌర్‌కు పలు రైతు సంఘాలు మద్దతుగా నిలిచాయి.

Published : 08 Jun 2024 06:04 IST

 9న న్యాయ యాత్ర నిర్వహణకు నిర్ణయం

చండీగఢ్‌: బాలీవుడ్‌ నటి, భాజపా ఎంపీ కంగనా రనౌత్‌ను చండీగఢ్‌ విమానాశ్రయంలో చెంపదెబ్బ కొట్టిన సీఐఎస్‌ఎఫ్‌ మహిళా కానిస్టేబుల్‌ కుల్వీందర్‌ కౌర్‌కు పలు రైతు సంఘాలు మద్దతుగా నిలిచాయి. ఈ కేసులో కానిస్టేబుల్‌కు అన్యాయం జరగకుండా చూడాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 9న మొహాలీలో ‘న్యాయ యాత్ర’ నిర్వహించనున్నట్లు వెల్లడించాయి. ఈ మేరకు శుక్రవారం చండీగఢ్‌లో సంయుక్త కిసాన్‌ మోర్చా(రాజకీయేతర) నాయకుడు జగ్జిత్‌ సింగ్‌ దల్లేవాల్, కిసాన్‌ మజ్దూర్‌ సంఘర్ష్‌ కమిటీ జనరల్‌ సెక్రటరీ సర్వణ్‌ సింగ్‌ పంధేర్‌ విలేకర్లకు తెలిపారు. ‘‘ఈ ఘటన జరగడానికి గల మొత్తం పరిణామాలపై సమగ్ర దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. మహిళా కానిస్టేబుల్‌కు అన్యాయం జరగకుండా చూడాలి’’ అని కోరుతూ వారు పంజాబ్‌ డీజీపీ గౌరవ్‌ యాదవ్‌ను కలుసుకుని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనలో మహిళా కానిస్టేబుల్‌ను అధికారులు సస్పెండ్‌ చేసి, విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. కుల్వీందర్‌ కౌర్‌కు గాయకుడు, స్వరకర్త విశాల్‌ దద్లానీ తన మద్దతు ప్రకటించారు. ఆమెపై సీఐఎస్‌ఎఫ్‌ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే ఆమె కోసం ఉద్యోగం ఎదురు చూస్తుందని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని