పాండియన్‌ నా వారసుడు కాదు: నవీన్‌

ఇటీవలి ఎన్నికల్లో ఒడిశాలో బిజద ఓటమికి తన సహాయకుడైన వి.కె.పాండియన్‌ను విమర్శించడం దురదృష్టకరమని నవీన్‌ పట్నాయక్‌ పేర్కొన్నారు.

Published : 09 Jun 2024 05:01 IST

భువనేశ్వర్‌: ఇటీవలి ఎన్నికల్లో ఒడిశాలో బిజద ఓటమికి తన సహాయకుడైన వి.కె.పాండియన్‌ను విమర్శించడం దురదృష్టకరమని నవీన్‌ పట్నాయక్‌ పేర్కొన్నారు. ఎన్నికల్లో దిగ్భ్రాంతికరమైన ఫలితాలు వెలువడిన తర్వాత తొలిసారిగా ఆయన స్పందించారు.  ‘పాండియన్‌పై కొన్ని విమర్శలున్నాయి. అది దురదృష్టకరం. ఆయన నిజాయతీపరుడు. వేర్వేరు రంగాల్లో అద్భుతంగా పనిచేశారు. ఆయన నా వారసుడు కాదు. నా ఓటమిని సవినయంగా అంగీకరించాను. ఏ మార్గంలో వీలైతే ఆ మార్గంలో ఒడిశా ప్రజలకు సేవలందిస్తా’ అని నవీన్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు