17వ లోక్‌సభ రద్దుతో మురిగిన యువతుల పెళ్లి వయసు పెంపు బిల్లు

పదిహేడవ లోక్‌సభ ఇటీవల రద్దు కావడంతో, యువతుల వివాహ వయస్సును 21 ఏళ్లకు పెంచుతూ 2021 డిసెంబరులో కేంద్రం తీసుకొచ్చిన బిల్లు మురిగిపోయింది.

Published : 09 Jun 2024 05:11 IST

దిల్లీ: పదిహేడవ లోక్‌సభ ఇటీవల రద్దు కావడంతో, యువతుల వివాహ వయస్సును 21 ఏళ్లకు పెంచుతూ 2021 డిసెంబరులో కేంద్రం తీసుకొచ్చిన బిల్లు మురిగిపోయింది. ఈ విషయాన్ని లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్, రాజ్యాంగ నిపుణుడు పీడీటీ ఆచార్య తెలిపారు. బాల్య వివాహాల నిరోధక సవరణ బిల్లు-2021ను లోక్‌సభలో కేంద్రం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అనంతరం ఈ బిల్లును విద్య, మహిళలు, చిన్నారులు, యువత, క్రీడలపై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ పరీశీలనకు పంపించారు. ప్రస్తుతం 18 ఏళ్లుగా ఉన్న యువతుల పెళ్లి వయసును పురుషులతో సమానంగా 21ఏళ్లకు పెంచాలన్నది ఈ బిల్లు ఉద్దేశం.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని