మణిపుర్‌లో మళ్లీ చెలరేగిన హింస

జాతుల ఘర్షణలతో గతేడాది అట్టుడికిన మణిపుర్‌లో మళ్లీ హింస చెలరేగింది. జీరీబామ్‌ జిల్లాలో శనివారం అనుమానిత మిలిటెంట్లు రెండు పోలీసు అవుట్‌ పోస్టులను దగ్ధం చేశారు. అటవీశాఖ కార్యాలయంతో పాటు 70 ఇళ్లకూ నిప్పుపెట్టారు.

Published : 09 Jun 2024 05:11 IST

రెండు పోలీసు అవుట్‌ పోస్టుల దగ్ధం
70 నివాసాలు కూడా
ఎస్పీని బదిలీ చేసిన ప్రభుత్వం

ఇంఫాల్‌: జాతుల ఘర్షణలతో గతేడాది అట్టుడికిన మణిపుర్‌లో మళ్లీ హింస చెలరేగింది. జీరీబామ్‌ జిల్లాలో శనివారం అనుమానిత మిలిటెంట్లు రెండు పోలీసు అవుట్‌ పోస్టులను దగ్ధం చేశారు. అటవీశాఖ కార్యాలయంతో పాటు 70 ఇళ్లకూ నిప్పుపెట్టారు. దీంతో ప్రభుత్వం.. జిల్లా ఎస్పీని బదిలీ చేసింది. రాజధాని ఇంఫాల్‌ నుంచి 70 మంది కమాండోలను జీరీబామ్‌ జిల్లాకు పంపించింది. జిల్లా పరిసరాల్లో నివసిస్తున్న మైతేయ్‌ వర్గానికి చెందిన 239 మందిని సహాయక శిబిరానికి తరలించారు. గురువారం సాయంత్రం ఓ వర్గానికి చెందిన 59 ఏళ్ల వ్యక్తి హత్యకు గురవడంతో ఈ తాజా అల్లర్లు చెలరేగాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని