ఫొటోలు, వీడియోలు నిజమైనవేనని ఆధారాలు సమర్పించాల్సిందే..

ప్రస్తుత డీప్‌ఫేక్‌ కాలంలో దంపతులు ఒకరిపై మరొకరు ఫొటోలు, వీడియోల సాయంతో నిందలు మోపే ముందు వాటిని నిరూపించగలిగేలా, న్యాయస్థానాల ఎదుట కచ్చితమైన ఆధారాలను సమర్పించాల్సిందేనని దిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.

Published : 09 Jun 2024 05:13 IST

భార్య మీద భర్త ఆరోపణలపై దిల్లీ హైకోర్టు వ్యాఖ్యలు

దిల్లీ: ప్రస్తుత డీప్‌ఫేక్‌ కాలంలో దంపతులు ఒకరిపై మరొకరు ఫొటోలు, వీడియోల సాయంతో నిందలు మోపే ముందు వాటిని నిరూపించగలిగేలా, న్యాయస్థానాల ఎదుట కచ్చితమైన ఆధారాలను సమర్పించాల్సిందేనని దిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. మైనర్‌ అయిన బిడ్డతో కలిసి దూరంగా ఉంటున్న భార్యకు ప్రతి నెలా రూ.75 వేల భరణం చెల్లించాలని కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను సవాల్‌ చేస్తూ.. భర్త వేసిన పిటిషన్‌ను జస్టిస్‌ రాజీవ్‌ శక్‌దర్, జస్టిస్‌ అమిత్‌ బన్సల్‌ల ధర్మాసనం శనివారం తోసిపుచ్చింది. దిల్లీకి చెందిన ఓ ఆర్కిటెక్ట్‌కు 2018లో వివాహమైంది. ఈ దంపతులకు అయిదేళ్ల పాప ఉంది. తన భార్యకు మరొకరితో సంబంధం ఉందంటూ.. అందుకు సంబంధించిన కొన్ని ఫొటోలను చూపుతూ అక్కడి ఫ్యామిలీ కోర్టులో విడాకులు కోసం భర్త దరఖాస్తు చేశారు. ఆ తీర్పు పెండింగ్‌లో ఉండటంతో.. అప్పటివరకూ తనకు నెలకు రూ.2 లక్షల భరణం చెల్లించాలని భార్య కోరింది. దాంతో ఆమె వాదనలు విన్న న్యాయస్థానం.. ప్రతి నెలా రూ.75 వేలు చెల్లించాలని భర్తను ఆదేశించింది. దీన్ని ఆయన దిల్లీ హైకోర్టులో సవాల్‌ చేశారు. విచారణ అనంతరం ఆరోపణలను నిరూపించగలిగే సాక్ష్యాలతో కుటుంబ న్యాయస్థానాన్నే ఆశ్రయించాలని ధర్మాసనం సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని