మణిపూర్‌లో నియంత్రణలోనే పరిస్థితులు

మణిపూర్‌లోని జిరిబామ్‌ జిల్లాలో పరిస్థితులు ఆందోళనకరంగానే ఉన్నా.. ప్రస్తుతానికైతే నియంత్రణలోనే ఉన్నాయని పోలీసులు తెలిపారు.

Published : 10 Jun 2024 05:15 IST

ఇంఫాల్‌: మణిపూర్‌లోని జిరిబామ్‌ జిల్లాలో పరిస్థితులు ఆందోళనకరంగానే ఉన్నా.. ప్రస్తుతానికైతే నియంత్రణలోనే ఉన్నాయని పోలీసులు తెలిపారు. శనివారం కొందరు అరాచకవాదులు రెండు పోలీస్‌ అవుట్‌పోస్టులు, ఫారెస్టు బీట్‌ కార్యాలయంతోపాటు మేతీ, కుకీ తెగల వారికి చెందిన దాదాపు 70 ఇళ్లను తగలబెట్టడంలో ఇక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి జిల్లా ఎస్పీని ఉన్నతాధికారులు బదిలీ చేయడంతోపాటు హింసను కట్టడి చేసేందుకు ప్రభావిత ప్రాంతాలకు ఆదివారం అదనపు బలగాలను తరలించారు. ఉద్రిక్తతలను రేకెత్తించే పోస్టులు పెట్టకుండా సోషల్‌ మీడియాపైనా పోలీసులు నిఘా ఉంచారు. అసత్య ప్రచారాలను వ్యాప్తి చేయవద్దంటూ స్థానికులను కోరుతున్నారు. జిరిబామ్‌కు చెందిన ఓ వ్యక్తి హత్య ఘటనతో గురువారం చెలరేగిన ఆందోళనలు క్రమక్రమంగా తీవ్ర రూపం దాల్చాయి.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు