ఏడుగురు మహిళలకు చోటు

కేంద్రంలో ప్రధాని మోదీ సారథ్యంలో ఆదివారం కొలువుదీరిన నూతన మంత్రివర్గంలో ఏడుగురు మహిళలకు చోటు దక్కింది. వారిలో ఇద్దరు కేబినెట్‌ హోదా పొందారు.

Published : 10 Jun 2024 05:34 IST

వారిలో ఇద్దరికి కేబినెట్‌ హోదా

దిల్లీ: కేంద్రంలో ప్రధాని మోదీ సారథ్యంలో ఆదివారం కొలువుదీరిన నూతన మంత్రివర్గంలో ఏడుగురు మహిళలకు చోటు దక్కింది. వారిలో ఇద్దరు కేబినెట్‌ హోదా పొందారు. గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన నిర్మలా సీతారామన్‌తో పాటు భాజపా ఎంపీలు అన్నపూర్ణాదేవి, శోభా కరంద్లాజే, రక్షా ఖడ్సే, సావిత్రి ఠాకుర్, నిముబెన్‌ బాంభణియా, అప్నాదళ్‌ ఎంపీ అనుప్రియా పటేల్‌ మంత్రి పదవులు సొంతం చేసుకున్నారు. నిర్మలా సీతారామన్, అన్నపూర్ణాదేవి కేబినెట్‌ హోదా పొందగా, మిగిలినవారు సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. గత ప్రభుత్వంలో 10 మంది మహిళా మంత్రులు ఉండగా, ఈ దఫా ఆ సంఖ్య 7కు తగ్గింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని