కేంద్ర మంత్రివర్గంలో ఏడుగురు మాజీ సీఎంలు

కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన కేంద్ర మంత్రిమండలిలో ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఏడుగురు మాజీ ముఖ్యమంత్రులు ఉండటం విశేషం.

Published : 10 Jun 2024 05:34 IST

దిల్లీ: కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన కేంద్ర మంత్రిమండలిలో ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఏడుగురు మాజీ ముఖ్యమంత్రులు ఉండటం విశేషం. ఈ జాబితాలో గతంలో గుజరాత్‌ సీఎంగా పని చేసిన ప్రధాని నరేంద్ర మోదీతో పాటు.. శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ (మధ్యప్రదేశ్‌), రాజ్‌నాథ్‌ సింగ్‌ (ఉత్తర్‌ప్రదేశ్‌), మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ (హరియాణా), సర్బానంద్‌ సోనోవాల్‌ (అస్సాం), హెచ్‌.డి.కుమారస్వామి (కర్ణాటక), జితిన్‌ రామ్‌ మాంఝీ (బిహార్‌) ఉన్నారు. ఇందులో ఐదుగురు సీఎంలు భాజపాకు చెందినవారు కాగా, కుమారస్వామి, మాంఝీలు జేడీ(ఎస్‌), హిందుస్థానీ అవామీ మోర్చాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని