రాష్ట్రపతి ముర్ముతో పలు దేశాల అగ్రనేతల భేటీ

ప్రధాని మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అతిథులుగా దిల్లీ విచ్చేసిన పలు దేశాల అగ్రనేతలు సోమవారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో విడివిడిగా సమావేశమయ్యారు.

Published : 11 Jun 2024 05:28 IST

దిల్లీ: ప్రధాని మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అతిథులుగా దిల్లీ విచ్చేసిన పలు దేశాల అగ్రనేతలు సోమవారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో విడివిడిగా సమావేశమయ్యారు. భారత్‌తో స్నేహబంధాన్ని దృఢపరుచుకోవడం, వివిధ రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంపై వారు చర్చించుకున్నారు. నేపాల్‌ ప్రధాని పుష్ప కమల్‌ దహల్‌ ప్రచండ, మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు, మారిషస్‌ అధ్యక్షుడు ప్రవింద్‌ కుమార్‌   జగన్నాథ్, సీషెల్స్‌ ఉపాధ్యక్షుడు అహ్మద్‌ అఫీఫ్‌ రాష్ట్రపతి భవన్‌కు వచ్చిన వారిలో ఉన్నారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా మెరుగుపరుచుకోవాలని అభిప్రాయపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని