ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటరులో.. నక్సల్స్‌ వద్ద అమెరికా తుపాకీ

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బీజాపుర్‌ వద్ద నవంబర్‌ 26న మావోయిస్టులతో జరిగిన ఎన్‌కౌంటరు అనంతరం స్వాధీనం చేసుకున్న నాలుగు ఆయుధాల్లో అమెరికాలో తయారైన ఎం1 కార్బైన్‌ తుపాకీ ఉన్నట్లు పోలీసులు ఆదివారం వెల్లడించారు.

Published : 05 Dec 2022 04:57 IST

రాయ్‌పుర్‌: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బీజాపుర్‌ వద్ద నవంబర్‌ 26న మావోయిస్టులతో జరిగిన ఎన్‌కౌంటరు అనంతరం స్వాధీనం చేసుకున్న నాలుగు ఆయుధాల్లో అమెరికాలో తయారైన ఎం1 కార్బైన్‌ తుపాకీ ఉన్నట్లు పోలీసులు ఆదివారం వెల్లడించారు. మిగతావాటితో పోల్చితే ఈ తుపాకీ బ్యారెల్‌ చిన్నగా ఉండి, పట్టుకునేందుకు అనువుగా ఉంటుంది. మిర్‌తుర్‌ పోలీస్‌స్టేషను పరిధిలోని పొమ్రా అడవుల్లో భద్రతా దళాలతో జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే. మావోయిస్టుల చేతికి అత్యాధునిక ఆయుధాలు ఎలా వస్తున్నాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గతంలో జరిగిన ఎన్‌కౌంటర్లలోనూ అమెరికా, జర్మనీల్లో తయారైన ఆయుధాలు మావోయిస్టుల వద్ద పోలీసులకు చిక్కాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని